Ad Code

సౌదీ అరేబియాకు 8000 మంది సైనికులను పంపిన పాకిస్తాన్


పాకిస్తాన్-సౌదీ అరేబియాల మధ్య కుదిరిన రక్షణ ఒప్పందం  భాగంగా . ఈ ఒప్పందంలో భాగంగా 8000 మంది సైనికులను సౌదీ అరేబియాకు పాకిస్తాన్ పంపుతోంది. 8000 మంది సైనికులు, ఒక ఫైటర్ జెట్ స్వ్కాడ్రన్, వాయు రక్షణ వ్యవస్థను పాక్ సౌదీలో మోహరించినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ విషయంపై పాకిస్తాన్ సైన్యం, విదేశీ మంత్రిత్వ శాఖ, సౌదీ ప్రభుత్వం నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ రెండు దేశాల ఒప్పందం ప్రకారం, ఒకరిపై జరిగిన దాడిని మరొకరిపై దాడిగా పరిగణించి రెండు దేశాలు కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాయి. సౌదీ అరేబియా కూడా పాకిస్తాన్ అణు రక్షణ గొడుగు కిందకు వస్తుందని పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ పేర్కొన్నారు. ప్రస్తుతం చైనీస్ తయారీ యుద్ధ విమానం జేఎఫ్-17లతో సహా, 16 ఫైటర్ జెట్‌లతో కూడిన ఒక స్వ్కాడ్రన్‌ను సౌదీ అరేబియాలో మోహరిస్తోంది. ఇదే కాకుండా చైనా తయారీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ HQ-9 కూడా మోహరించింది. ప్రస్తుతం 8000 మంది పాక్ సైనికులను తరలించగా, భవిష్యత్తులో పరిస్థితులను బట్టి 80,000 మందిని కూడా పంపొచ్చని నివేదికలు చెబుతున్నాయి. ఆయుధాలు, సైనికులు పాకిస్తాన్‌కు చెందిన వారు కాగా, వారి ఖర్చుల్ని సౌదీ అరేబియా భరిస్తుంది.

Post a Comment

0 Comments

Close Menu