తెలంగాణ లోని నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు శివారులోని నోష్ ఫార్మా కంపెనీలో మరోసారి రియాక్టర్ పేలింది. ఈ ఘటనలో మూడో బ్లాక్‌లో విధులు నిర్వహిస్తున్న కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. కెమికల్ మిక్సింగ్ జరుగుతుండగా రియాక్టర్ ఒక్కసారిగా బ్లాస్ట్ అయింది. ఆ పేలుడు ధాటికి ఫ్యాక్టరీ పరిసరాల్లో భారీ శబ్ధం వినిపించింది. ఈ దుర్ఘటనలో మొత్తం 8 మంది కార్మికులకు గాయాలు కాగా అందులో ఒకరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లుగా సమాచారం. ఈ మేరకు గాయపడిన వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు విచారణ చేపడుతున్నారు. ఏప్రిల్ 9న కూడా ఇదే కంపెనీలో రియాక్టర్ పేలిన ఘటనలో ఇద్దరు కార్మికులకు గాయాలయ్యాయి.
0 Comments