ఇరాన్ రాజధాని టెహ్రాన్ సమీపంలో ఉన్న ఒక షాపింగ్ మాల్‌లో జరిగిన భారీ అగ్నిప్రమాదం సంభవించి ఎనిమిది మంది మరణించగా, 36 మంది గాయపడినట్లు ప్రభుత్వ టీవీ వెల్లడించింది. టెహ్రాన్ ప్రావిన్స్‌లోని అండిషే పట్టణంలో ఉన్న అర్ఘవాన్ షాపింగ్ సెంటర్ లో మంగళవారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అగ్నిప్రమాదానికి గల ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదని, అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఐఆర్ఐబి తెలిపింది. బహుళ అంతస్తుల భవనం నుంచి నల్లటి పొగలు ఎగిసిపడుతున్న దృశ్యాలు, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు చేసిన ప్రయత్నాలు వీడియోల్లో కనిపించాయి. భవనం క్లాడింగ్ మండే స్వభావం కలిగి ఉండటం వల్ల మంటలు వేగంగా వ్యాపించినట్లు స్థానిక అగ్నిమాపక శాఖ తెలిపిందని మిజాన్ న్యూస్ ఏజెన్సీవెల్లడించింది. గంటల పాటు శ్రమించిన అగ్నిమాపక సిబ్బంది చివరకు మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
0 Comments