Ad Code

త్వరలో మోటోరోలా ఎడ్జ్ 70 ప్రో ప్లస్ విడుదల


దేశీయ మార్కెట్లోకి మోటోరోలా ఎడ్జ్ 70 ప్రో ప్లస్ త్వరలో  అడుగుపెట్టబోతోంది. ఈ మేరకు ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేక మైక్రోసైట్ ప్రత్యక్షమైంది. మోటోరోలా ఎడ్జ్ 70 ప్రో ప్లస్ స్మార్ట్‌ఫోన్ డిజైన్ పరంగా వినియోగదారులను మొదటి చూపులోనే ఆకట్టుకునేలా ఉంది. కంపెనీ విడుదల చేసిన అధికారిక టీజర్ ప్రకారం.. ఈ ఫోన్ వెనుక భాగం అత్యంత ప్రీమియం లుక్‌తో రానుంది. ఇందులో మూడు రకాల ప్రత్యేకమైన ఫినిషింగ్‌లను పరిచయం చేస్తున్నారు. ప్యాంటోన్ సాటిన్ లక్స్, ప్యాంటోన్ ట్విల్ డిజైన్‌లతో పాటు సహజమైన వుడ్ రూపాన్ని తలపించేలా 'స్కల్ప్టెడ్ వుడ్' వేరియంట్‌ను కూడా తీసుకువస్తున్నారు. బ్రౌన్, రెడ్, టీల్ రంగుల్లో లభించే ఈ ఫోన్‌కు మెటాలిక్ ఫ్రేమ్‌ను అమర్చడం వల్ల చేతిలో పట్టుకున్నప్పుడు ఎంతో విలాసవంతమైన అనుభూతిని ఇస్తుంది. ముందు భాగంలో పంచ్-హోల్ డిస్‌ప్లే డిజైన్‌తో బెజెల్స్ లేకుండా స్క్రీన్ చాలా ఆకర్షణీయంగా కనిపిస్తోంది. కెమెరా విభాగంలో ఈ ఫోన్ సరికొత్త సంచలనాలకు తెరలేపనుంది. మోటోరోలా ఎడ్జ్ 70 ప్రో ప్లస్ వెనుక వైపు మూడు కెమెరాల అమరిక ఉంది. ఇందులో సోనీ ఎల్‌వైటీ సెన్సార్‌ను ఉపయోగిస్తున్నట్లు సంస్థ స్పష్టం చేసింది. అంతేకాకుండా, చేతులు వణికినా ఫొటోలు, వీడియోలు స్పష్టంగా వచ్చేలా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సాంకేతికతను జోడించారు. ముఖ్యంగా 81mm ఫోకల్ లెంగ్త్‌తో కూడిన డెడికేటెడ్ టెలిఫొటో లేదా పెరిస్కోప్ లెన్స్ ఉండబోతున్నట్లు టీజర్ సంకేతాలు ఇస్తోంది. 

Post a Comment

0 Comments

Close Menu