Ad Code

వివో ఎస్ 50 టీ 5జీ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల


చైనా మార్కెట్లో వివో ఎస్ 50 టీ 5జీ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఫ్లాగ్‌షిప్ స్థాయి ఫీచర్లతో వచ్చిన ఈ ఫోన్, అధిక పనితీరు, దీర్ఘకాల బ్యాటరీ లైఫ్, అద్భుతమైన కెమెరా సామర్థ్యాలతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇది రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌లో 6.59-అంగుళాల AMOLED డిస్‌ప్లే ఉంది. 1.5K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, HDR సపోర్ట్‌తో సూపర్ స్మూత్ విజువల్ అనుభవం ఇస్తుంది. P3 కలర్ గామట్, తక్కువ బ్లూ లైట్ టెక్నాలజీ, హై-ఫ్రీక్వెన్సీ PWM డిమ్మింగ్ వంటి ఫీచర్లు కంటి రక్షణతో పాటు క్లారిటీని పెంచుతాయి. ఈ డివైస్‌లో Qualcomm Snapdragon 8s Gen 3 ప్రాసెసర్ అమర్చారు. ఇది హై-పర్ఫార్మెన్స్ పనులకు, గేమింగ్‌కు బాగా సూట్ అవుతుంది. Android 16 ఆధారంగా OriginOS 6 UIతో ఫోన్ వేగవంతమైన, స్మూత్ యూజర్ అనుభవాన్ని అందిస్తుంది. దీనిలో 6500mAh భారీ బ్యాటరీ ఉంది. ఇది ఒకసారి ఛార్జ్ చేస్తే ఎక్కువసేపు ఉపయోగించుకునేలా చేస్తుంది. 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో తక్కువ సమయంలోనే ఫుల్ ఛార్జ్ అవుతుంది. వెనుక భాగంలో 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా వైడ్ లెన్స్ ఉన్నాయి. అలాగే సోనీ IMX882 సెన్సార్‌తో 50MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా కూడా అందించారు. ముందు భాగంలో 50MP సెల్ఫీ కెమెరా, ఫ్రంట్ ఫ్లాష్ ఉండటం సెల్ఫీ ప్రేమికులకు మంచి ఎంపికగా మారుస్తుంది. ఈ ఫోన్ 12GB, 16GB RAM ఆప్షన్లతో పాటు 512GB స్టోరేజ్‌తో వస్తోంది. భారీ స్టోరేజ్ వల్ల ఫోటోలు, వీడియోలు, యాప్స్ కోసం విస్తృత స్థలం లభిస్తుంది. Wi-Fi 6, Bluetooth 5.4, NFC, IR బ్లాస్టర్ వంటి ఆధునిక కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. భద్రత కోసం అల్ట్రాసోనిక్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ అందించారు. అదనంగా, స్టీరియో స్పీకర్లు, హై-క్వాలిటీ ఆడియో సపోర్ట్ కూడా ఉన్నాయి.

Post a Comment

0 Comments

Close Menu