నేడు అంతర్జాతీయ కార్మిక దినోత్సవం. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది శ్రమజీవుల హక్కులను, వారి పోరాటాలను గౌరవించుకునే రోజూ ఇది. ఈ ఏడాది మే డే కోసం అంతర్జాతీయ కార్మిక సంస్థ "ఆరోగ్యకరమైన సైకో సోషల్ పని వాతావరణం" అనే థీమ్‌ను ఎంచుకుంది. ఆధునిక పని ఒత్తిడిలో కార్మికులు ఎదుర్కొంటున్న మానసిక సమస్యలపై ఇది దృష్టి సారిస్తుంది. పని ప్రదేశాల్లో ఒత్తిడి, బర్న్ అవుట్ వంటి సమస్యలను గుర్తించి, వాటికి తగిన పరిష్కారాలు చూపడం. పని వేళలను క్రమబద్ధీకరించడం ద్వారా వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యత ఇవ్వడం.పని ప్రదేశాల్లో వివక్ష, వేధింపులు లేకుండా సురక్షితమైన వాతావరణాన్ని కల్పించడం. 1886లో చికాగోలో జరిగిన 'హే మార్కెట్ అఫైర్' మే డే ఆవిర్భావానికి కారణమైంది. రోజుకు కేవలం 8 గంటల పని దినం ఉండాలని కోరుతూ కార్మికులు చేసిన పోరాటమే దీనికి పునాది.భారత్‌లో మొదటి మే డే వేడుకలు 1923లో చెన్నైలో జరిగాయి. 1947 నుంచి దీనిని అధికారికంగా గుర్తించడం ప్రారంభించారు. ముఖ్యంగా తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఈ రోజున సెలవు దినంగా ప్రకటిస్తారు. మెరుగైన వేతనాలు, పని పరిస్థితుల కోసం కార్మిక సంఘాలు నిరసనలు మరియు సమావేశాలు నిర్వహిస్తాయి. గృహ కార్మికులు, వలస కూలీలు, కాంట్రాక్ట్ కార్మికుల హక్కుల కోసం అవగాహన కల్పిస్తారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, పని ప్రదేశాల్లో భద్రత గురించి ప్రభుత్వాలు చర్చలు చేపడతాయి.
0 Comments