Ad Code

కోవిడ్ 19 తరహాలో హంటా వైరస్ విజృంభించే అవకాశం లేదు : డబ్ల్యూహెచ్‌ వో


కోవిడ్ 19 తరహాలో హంటా వైరస్ విజృంభించే అవకాశం లేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది. డబ్ల్యూహెచ్‌వో ఎపిడెమిక్ అండ్ పాండమిక్ మేనేజ్‌మెంట్ డైరెక్టర్ డాక్టర్ మరియా వాన్ కెర్ఖోవ్ మాట్లాడుతూ ''ఇది కోవిడ్ లేదా ఇన్‌ఫ్లుయెంజా లాంటిది కాదు. దీని వ్యాప్తి తీరు పూర్తిగా భిన్నం. ఇది కొత్తగా వచ్చిన వైరస్ కూడా కాదు. చాలా కాలంగా ఉనికిలో ఉన్నదే. దీనివల్ల మరో కోవిడ్ లాంటి మహమ్మారి వస్తుందని భావించడం తప్పు'' అని పేర్కొన్నారు.

Post a Comment

0 Comments

Close Menu