Ad Code

18 కార్పొరేషన్లకు చైర్మన్లను నామినేట్ చేసిన తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని పలు కీలక నామినేటెడ్ పదవులను భర్తీ చేసింది. వివిధ ప్రభుత్వ కార్పొరేషన్లు, సొసైటీలకు చైర్మన్లను నియమిస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (సీఎస్) రామకృష్ణారావు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 18 కార్పొరేషన్లకు చైర్మన్లను ఖరారు చేయడంతో పాటు, గ్రామ పంచాయతీ ట్రైబ్యునల్‌కు చైర్మన్, సభ్యులను కూడా ప్రభుత్వం నియమించింది. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌కి బస్వరాజు శ్రీనివాస్‌,వాషర్‌మెన్‌ కో-ఆపరేటివ్‌ కార్పొరేషన్‌కిదాసరిరాజు అజయ్‌ కుమార్‌, గీతకార్మికుల కార్పొరేషన్‌కి మోతుకూరి చంద్రశేఖర్‌ గౌడ్‌, పెరిక సహకార కార్పొరేషన్‌కి దొంగారి వెంకటేశ్వర్లు, మేర సహకార కార్పొరేషన్‌కి సంగా వెంకటరాజం, వాల్మీకి బోయ సహకార కార్పొరేషన్‌కి గట్టు తిమ్మప్ప, మున్నూరు కాపు సహకార కార్పొరేషన్‌కి బొమ్మ శ్రీరామ్‌, యాదవ సహకార కార్పొరేషన్‌కి ఎం.రఘునాథ్‌ యాదవ్‌, వడ్డెర సహకార కార్పొరేషన్‌కి గుంజ రేణుక నారాయణ, చేనేత అభివృద్ధి కార్పొరేషన్‌కి దూదెం వెంకటరమణ, కమ్మ కార్పొరేషన్‌కి బండి రమేష్‌, పద్మశాలి సహకార కార్పొరేషన్‌కి గూడురు శ్రీనివాస్‌,భట్టరాజ కోఆపరేటివ్‌ సొసైటీ ఫెడరేషన్‌కి సీహెచ్‌ బాలరాజు, వెలమ కార్పొరేషన్‌కి జువ్వాది నర్సింగ్‌రావు, గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార ఫెడరేషన్‌కి కొల్లె సరిత, లైవ్‌స్టాక్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీకి చరణ్‌ కౌశిక్‌ యాదవ్‌, తెలంగాణ తెలుగు అకాడమీకి ప్రొపెసర్ వెంకటనారాయణ, తెలంగాణ గ్రామ పంచాయతీ ట్రైబ్యునల్‌కి సూదిని రామిరెడ్డి, తెలంగాణ గ్రామపంచాయతీ ట్రైబ్యునల్‌ సభ్యులుగా నగులూరి కృష్ణకుమార్‌, బూసా వేణుగోపాల్‌ను ప్రభుత్వం నియమించింది.

Post a Comment

0 Comments

Close Menu