Ad Code

చిరాగ్ పాశ్వాన్‌తో పెళ్లి : కొట్టిపారేసిన కంగనా రనౌత్


కంగనా రనౌత్ - చిరాగ్ పాశ్వాన్ పెళ్లి వార్తలు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై ఎట్టకేలకు కంగనా స్పందించారు. వారిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందన్న వార్తలను ఆమె పూర్తిగా కొట్టిపారేశారు. చిరాగ్ పాశ్వాన్‌తో ఉన్న సంబంధంపై కంగనా స్పష్టతనిస్తూ  చిరాగ్ నాకు చాలా కాలంగా తెలుసు. అతను నాకు అత్యంత సన్నిహిత మిత్రుడు. మా మధ్య ఉన్నది కేవలం స్నేహం మాత్రమే, అంతకు మించి ఎలాంటి ప్రేమ కానీ, రొమాన్స్ కానీ లేవని తేల్చి చెప్పారు. మా మధ్య నిజంగానే ప్రేమ ఉండి ఉంటే ఈ పాటికి మాకు పెళ్లి అయ్యి పిల్లలు కూడా ఉండేవారు. ఇన్నేళ్లుగా మా బంధంలో ఎలాంటి మార్పు రాలేదు, అది ఎప్పటికీ స్నేహంగానే ఉంటుంది అంటూ రూమర్లకు కౌంటర్ ఇచ్చారు. వీరిద్దరి ప్రయాణం 2011లో మొదలైంది. 2011లో విడుదలైన ఈ సినిమాలో కంగనా, చిరాగ్ జంటగా నటించారు. ఆ తర్వాత చిరాగ్ రాజకీయాల్లోకి వెళ్లగా, కంగనా స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. ప్రస్తుతం వీరిద్దరూ ఎంపీలుగా పార్లమెంట్‌లో కొనసాగుతున్నారు. ఇటీవల పార్లమెంట్ ఆవరణలో వీరిద్దరూ నవ్వుతూ పలకరించుకున్న వీడియోలు, ఫోటోలు వైరల్ కావడంతో ఈ పెళ్లి రూమర్లు మళ్ళీ తెరపైకి వచ్చాయి. 

Post a Comment

0 Comments

Close Menu