బెంగళూరులోని సిలికాన్ సిటీ, నాయండహళ్లిలో ఒకటిన్నర ఏళ్ల చిన్నారి ఆడుకుంటూ మూడో అంతస్తు బాల్కనీ నుంచి ప్రమాదవశాత్తూ కిందపడిపోయింది. ఈ భయానక దృశ్యాలు అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. ప్రస్తుతం ఆ చిన్నారి ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతుండగా, ఆ దృశ్యాలు చూసిన నెటిజన్లు ఒక్కసారిగా షాక్‌కు గురవుతున్నారు. నవీన్, జయశ్రీ దంపతులకు ఒకటిన్నర ఏళ్ల కుమార్తె సహానా ఏప్రిల్ 6వ తేదీన ఇంట్లో అందరూ ఉన్న సమయంలోనే తల్లి కిచెన్‌లో ఉన్న సమయంలో చిన్నారి ఆడుకుంటూ మెయిన్ డోర్ బయటకు వచ్చింది. బాల్కనీలో ఉన్న కుర్చీపైకి ఎక్కి ఆడుకుంటుండగా, ఒక్కసారిగా పట్టుతప్పి మూడో అంతస్తు నుంచి కింద పడిపోయింది. ఆ చిన్నారికి తలకి తీవ్ర గాయాలయ్యాయి. కింద పడి ఉన్న తన బిడ్డను చూసి తల్లి జయశ్రీ అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోయింది. ఆమె బీపీ ఒక్కసారిగా పడిపోవడంతో స్థానికులు హుటాహుటిన తల్లిని, బిడ్డను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సహానా బసవనగుడిలోని రంగదొరె ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతోంది.
0 Comments