Ad Code

అజిత్ అగార్కర్ కాంట్రాక్ట్ ను పొడిగించనున్న బీసీసీఐ ?


సీనియర్ మెన్స్ సెలక్షన్ కమిటీ చైర్మెన్‌గా అజిత్ అగార్కర్ పదవీకాలాన్ని పొడిగించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి సిద్దమైంది. కొత్త కాంట్రాక్ట్ ప్రకారం అగార్కర్ తన పదవిలో వన్డే వరల్డ్‌కప్‌-2027 వరకు కొనసాగనున్నాడు. వాస్తవానికి అగార్కర్ కాంట్రాక్ట్ ఈ ఏడాది చివర్లలో ముగియాల్సి ఉంది. కానీ వచ్చే ఏడాది జరగనున్న వరల్డ్‌కప్ దృష్టిలో పెట్టుకుని చీఫ్ సెలక్టర్‌గా అగార్కర్‌నే కొనసాగించాలని బోర్డు నిర్ణయించింది. అగార్కర్ హయాంలో టీమిండియా అద్భుత విజయాలు సాధించింది. ఈ ముంబైకర్ బీసీసీఐ చీఫ్ సెలక్టర్‌గా 2023 జూలైలో బాధ్యతలు చేపట్టగా.. అప్పటి నుంచి భారత జట్టు వైట్-బాల్ క్రికెట్‌లో తిరుగులేని శక్తిగా ఎదిగింది. అతడి నేతృత్వంలో భారత్ మూడు ప్రధాన ఐసీసీ టోర్నీలను కైవసం చేసుకుంది. వరుసగా రెండు టీ20 ప్రపంచకప్‌(2024, 2026)లతో పాటు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని టీమిండియా సొంతం చేసుకుంది. ఈ కారణాలతో అతడి కాంట్రాక్ట్‌ను బీసీసీఐ పొడిగించనుంది. ఈ విషయాన్ని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు ధ్రువీకరించారు. అగార్కర్ హయంలో భారత జట్టు చారిత్రత్మక విజయాలను అందుకుంది. అతడి నేతృత్వంలో సెలక్షన్ కమిటీ కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంది. జట్టులో కూడా చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. అతడి పని తీరు పట్ల బోర్డు సంతృప్తిగా ఉంది. అగార్కర్‌నే చైర్మెన్ కొనసాగించాలని బోర్డు భావిస్తోంది. 

Post a Comment

0 Comments

Close Menu