ఆఫ్ఘనిస్తాన్ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ కు భారత్, ఆస్ట్రేలియా దేశాల నుంచి పౌరసత్వం ఇస్తామని ఆఫర్లు వచ్చినప్పటికీ తాను మాత్రం కేవలం ఆఫ్ఘనిస్తాన్ తరఫునే అంతర్జాతీయ క్రికెట్ ఆడతానని స్పష్టం చేశాడు. భారత్, ఆస్ట్రేలియా దేశాల నుంచి పౌరసత్వంను సున్నితంగా తిరస్కరించానని రషీద్ వెల్లడించాడు. ‘2023 ఐపీఎల్ సమయంలో గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడుతున్నప్పుడు భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ)కి చెందిన ఒక ఉన్నతాధికారిని ఆయన ఆహ్వానం మేరకు వెళ్లి ప్రత్యేకంగా కలిశాను. ఆ అధికారి భారత్‌లో స్థిరపడమని సలహా ఇచ్చారు. ఆఫ్ఘనిస్తాన్ లో ప్రస్తుత పరిస్థితులు బాగాలేవు కాబట్టి భారత్‌కు వచ్చేయాలని చెప్పారు. ఇక్కడ ఉండటానికి కావాల్సిన అన్ని డాక్యుమెంట్లు సమకూరుస్తామని, ఇక్కడే ఉంటూ క్రికెట్ ఆడవచ్చని ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదన విని మొదట ఆశ్చర్యపోయాను. అయితే నవ్వుతూనే ఆ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించా’ అని రషీద్ ఖాన్ చెప్పాడు. ‘మీ మద్దతుకు ధన్యవాదాలు. కానీ నేను నా దేశం ఆఫ్ఘనిస్తాన్ తరఫునే క్రికెట్ ఆడాలనుకుంటున్నాను. నా దేశం తరఫున ఆడలేనప్పుడు, మరే ఇతర దేశం కోసం కూడా ఆడను అని చెప్పానని’ అని రషీద్ ఖాన్ వెల్లడించాడు. ఆస్ట్రేలియా ఆఫర్‌ను కూడా ఇలానే తిరస్కరించానని రషీద్ చెప్పాడు. ఈ ఘటనతో తన దేశం పట్ల ఆయనకు ఉన్న నిబద్ధత, దేశభక్తి మరోసారి ప్రపంచానికి తెలిసింది.
0 Comments