మలయాళ స్టార్ హీరోయిన్ మంజు వారియర్‌కు చేదు అనుభవం ఎదురైంది. కేరళలోని పాలక్కాడ్‌లో ఓ ఈవెంట్‌కు హాజరైన ఆమెను ఓ మహిళా అభిమాని బలవంతంగా ముద్దు పెట్టుకుంది. ఉన్నట్లుండి ఇలా జరగడంతో హీరోయిన్ తో పాటు అక్కడున్న వారందరూ నిర్ఘాంతపోయారు. ఈ ఈవెంట్ యాంకర్ కూడా సదరు అభిమానిని గట్టిగా మందలించింది. మన దగ్గరకు వచ్చిన సెలబ్రిటీలతో ఇలా ప్రవర్తించడం సరికాదని హెచ్చరించింది. అయితే సదరు మహిళ మాత్రం తను చేసిన పనిని సమర్థించుకుంది. 'నాకు మంజు అక్క అంటే చాలా ఇష్టం. అందుకే ముద్దు పెట్టుకున్నా' అని సమాధానమిచ్చింది. అయితే ఇంత జరుగుతున్నప్పటికీ మంజు వారియర్ మాత్రం ఏ మాత్రం కోపగించుకోలేదు. ఇది జరిగిన తర్వాత కూడా ఎంతో ఓపికగా, సహనంతో మిగతా అభిమానులతో సరదాగా మాట్లాడుతూ ఫొటోలు, సెల్ఫీలు దిగింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
0 Comments