పోలీస్‌ వాహనం ఢీకొని ఏఎస్‌ఐ మృతి


తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో పోలీస్‌ వాహనం ఢీకొని విధి నిర్వహణలో ఉన్న ఓ ఏఎస్ఐ మరణించారు. మానూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ దుర్ఘటన జరిగింది. మానూర్ పోలీస్‌స్టేషన్‌లో ఏఎస్ఐగా పనిచేస్తున్న గోవింద్ నాయక్ విధి నిర్వహణలో ఉన్న సమయంలో హోంగార్డు రామారావు నడుపుతున్న పోలీసు వాహనం అదుపుతప్పి ఆయనను బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో ఆయనకు తీవ్రంగా గాయపడ్డారు. తోటి సిబ్బంది వెంటనే ఆయనను నారాయణఖేడ్‌లోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో ఆయన మృతిచెందారు. అయితే ఈ ఘటనపై మృతుని కుటుంబసభ్యులు సంచలన ఆరోపణలు చేశారు. ఇది ప్రమాదవశాత్తు జరిగింది కాదని, పాత కక్షల నేపథ్యంలో హోంగార్డు రామారావును కావాలనే వాహనంతో ఢీకొట్టి హత్య చేశారని వారు ఆరోపిస్తున్నారు. కాగా ప్రమాదం జరిగిన వెంటనే రామారావు అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. హోంగార్డు నడుపుతున్న వాహనం ఢీకొని ఏఎస్‌ఐ మృతిచెందడం పోలీసు వర్గాల్లో కలకలం రేపింది. 

Post a Comment

0 Comments

Bottom Ad [Post Page]

Advertisement

WearYourDictionary

Random Posts

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Sed ultricies, sapien et auctor bibendum, magna urna posuere purus, at vehicula erat est ac sem.

Copyright

Copyright © 2022 BlogName.
Credits: imamuddinwp

#Advertisement Popup


SVG Icons

Social

sr7themes.eu.org

Newest Post

జాగ్వార్ ల్యాండ్ రోవర్‌లో 4 వేల ఉద్యోగులకు ఉద్వాసన ?

టాటా మోటార్స్‌కు చెందిన లగ్జరీ కార్ల బ్రాండ్ 'జాగ్వార్ ల్యాండ్ రోవర్' (జేఎల్ఆర్) అంతర్జాతీయ మార్కెట్లో ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్...

Total Pageviews

#Advertisement


#Advertisement


Translate

Travel the world

Full width home advertisement

Advertisement

Random Post

Follow us

Pages

Author Description

Hey there! We are Colorlib, crafting beautiful free website templates and themes since 2013. Our designers push the boundaries to deliver high quality templates for bloggers, businesses, and creatives worldwide!

Post Page Advertisement [Top]

Advertisement

Climb the mountains