Ad Code

కాళేశ్వరం తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ : నిర్ణయించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం


కాళేశ్వరం తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే న్యాయ విభాగంతో చర్చలు పూర్తయ్యాయని, తదుపరి చర్యలకు సిద్ధమవుతున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ప్రాజెక్టుకు సంబంధించిన వివిధ అంశాలపై న్యాయస్థానంలో పూర్తి వివరాలు సమర్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లోనూ, పాలనా వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. కాగా, కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై విచారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌పై దాఖలైన పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించిన సంగతి తెలిసిందే. కమిషన్ సమర్పించిన నివేదిక ఆధారంగా బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు, ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్, మాజీ ఐఏఎస్ ఎస్‌కే జోషిపై ఎలాంటి చర్యలు తీసుకోరాదని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంతేకాకుండా, జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణలో పలు నిబంధనలు పాటించలేదని హైకోర్టు అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో కమిషన్ నివేదిక ఆధారంగా ముందస్తు చర్యలు చేపట్టరాదని స్పష్టం చేసింది. 

Post a Comment

0 Comments

Close Menu