బంగారం ధరలు గత రెండు రోజులుగా తగ్గగా, ఈరోజు భారీగా పెరిగాయి. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్దంపై కొనసాగుతున్న అనిశ్చితి వల్ల బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. మంగళవారం బంగారం ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్‌లో 10 గ్రామలు 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ రేటు రూ.1,53,930 వద్ద కొనసాగుతోంది. సోమవారం ఇది రూ.1,52,460గా ఉండగా, ఇవాళ ఏకంగా రూ.1470 పెరిగింది. ఇక 22 క్యారెట్ల ధర రూ.1,41,100 వద్ద కొనసాగుతోండగా, నిన్న రూ.1,39,750గా ఉంది. నిన్నటితో పోలిస్తే రూ.1350 పెరిగింది. చెన్నైలో నిన్న రూ.1,53,380గా ఉండగా, ఈరోజు రూ.1,55,130కి చేరుకుంది. అంటే రూ.1750 పెరిగింది. 22 క్యారెట్ల ధర రూ.1,42,200 వద్ద ట్రేడవుతోంది. సోమవారం ఇది రూ.1,40,600 వద్ద కొనసాగింది. ఇవాళ రూ.1600 పెరిగింది. ఢిల్లీలో 24 క్యారెట్ల రేటు చూస్తే రూ.1,54,080గా ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,41,250 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో 24 క్యారెట్ల స్వచ్చమైన మేలిమి బంగారం ధర రూ.1,53,930 వద్ద ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,41,100 వద్ద కొనసాగుతోంది. వెండి ధరలు కూడా పెరిగాయి. బెంగళూరులో కేజీ సిల్వర్ ధర రూ.2.55 లక్షల వద్ద ఉంది. చెన్నైలో నిన్న రూ.2.60 లక్షల వద్ద ఉండగా, ఇవాళ రూ.2.65 లక్షలకు చేరుకున్నాయి. హైదరాబాద్‌లో కూడా రూ.2.65 లక్షల వద్ద కొనసాగుతున్నాయి.
0 Comments