Ad Code

స్కూల్ బస్సు కింద పడి నాలుగేళ్ల బాలుడు దుర్మరణం


ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం వరగాని గ్రామంలో శనివారం స్థానిక శ్రీనివాస సీబీఎస్ఈ స్కూల్‌కు చెందిన బస్సు కింద పడి కూచపూడి కృప అన్వేష్ (4) అనే యూకేజీ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. బస్సు ఎక్కుతున్న సమయంలోనో లేదా దిగిన తర్వాతో డ్రైవర్ అజాగ్రత్త వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. కళ్ల ముందే చిన్నారి విగతజీవిగా పడి ఉండటాన్ని చూసి తల్లిదండ్రులు, గ్రామస్థులు కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే బస్సు డ్రైవర్ అక్కడి నుండి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, పరారీలో ఉన్న డ్రైవర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యంపై కూడా విచారణ జరుపుతామని అధికారులు వెల్లడించారు. 

Post a Comment

0 Comments

Close Menu