తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో మిలియన్ మార్చ్ పేరుతో 2011 మార్చిలో భారీ ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ట్యాంక్ బండ్ వద్ద జరగగా, ఆ సమయంలో ఆందోళనకారులు కొన్ని మీడియా సంస్థలకు చెందిన కెమెరాలు, వోబీ వ్యాన్లను ధ్వంసం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో భాగంగా కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావులను కూడా నిందితులుగా చేర్చారు. అయితే, ఈ ఘటనకు పిటిషనర్లకు ఎలాంటి ప్రత్యక్ష సంబంధం లేదని వారి తరఫు న్యాయవాది రమణారావు కోర్టులో వాదనలు వినిపించారు. వాదనలు విన్న హైకోర్టు, కేసులో సరైన ఆధారాలు లేవని భావించి కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావుపై నమోదైన కేసులను కొట్టివేసింది.
0 Comments