Ad Code

పోలింగ్ బూత్ వద్ద నాటు పేలుడు : పోలింగ్ ప్రక్రియకు ఆటంకం


శ్చిమ బెంగాల్ లోని ముర్షీదాబాద్‌ జిల్లాలోని నవ్‌దా ప్రాంతంలో ఓటర్లు బారులు తీరిన సమయంలో దుండగులు నాటు బాంబులతో విరుచుకుపడటం ఆందోళనకు దారితీసింది.  ఉదయం పోలింగ్ ప్రశాంతంగా సాగుతున్న సమయంలో, నవ్‌దాలోని ఓటింగ్ కేంద్రం సమీపంలో ఒక్కసారిగా నాటు బాంబు పేలింది. ఈ హఠాత్పరిణామంతో ఓటర్లు, స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. పోలింగ్ ప్రక్రియకు ఒక్కసారిగా తీవ్ర ఆటంకం ఏర్పడింది.

Post a Comment

0 Comments

Close Menu