రినికీ భూయాన్‌ శర్మపై ఆరోపణల కేసు : పవన్‌ ఖేడా నివాసంలో సోదాలు


స్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ భార్య రినికీ భూయాన్‌ శర్మపై ఆరోపణల కేసులో అస్సాం పోలీసులు ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పవన్‌ ఖేడా నివాసంలో సోదాలు చేపట్టారు. హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ఉన్న పవన్ ఖేరా, ఆయన భార్య నీలిమ ఇంటి బయట పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి, భారీ భద్రతను ఏర్పాటు చేశారు. తమను అస్సాం పోలీసులు ఇంకా సంప్రదించలేదని నగర పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ అస్సాం పోలీసులు వచ్చి నోటీసు ఇస్తే తాము సహకరిస్తామని వారు తెలిపారు. మరోవైపు పవన్ ఖేడా ఆచూకీ కోసం తాము ఇంకా ప్రయత్నిస్తున్నామని అస్సాం పోలీసులు బుధవారం తెలిపారు. ఢిల్లీలోని ఖేడా నివాసంలో నిజాముద్దీన్ ఈస్ట్‌లో ఉన్న కాంగ్రెస్ నాయకుడి ఇంటికి అస్సాం పోలీసుల బృందం దాదాపు రెండు గంటల పాటు సోదాలు జరిపిన అనంతరం, పోలీసులు "కొన్ని నేరారోపణ సాక్ష్యాలు" ఎలక్ట్రానిక్ పరికరాలతో వెనుదిరిగారు. హిమంత భార్యకు మూడు పాస్‌పోర్టులు ఉన్నాయని, విదేశాల్లో అక్రమంగా ఆస్తులు కూడబెట్టారని, ఆ సమాచారాన్ని ఎన్నికల అఫిడవిట్‌లో ప్రస్తావించలేదని ఖేడా తీవ్ర ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే. దీనిపై సీఎం భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఖేడాపై గువాహటిలోని క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. దర్యాప్తులో భాగంగా అస్సాం పోలీసులు మంగళవారం ఢిల్లీలో పవన్‌ ఖేడా నివాసానికి చేరుకొని సోదాలు చేశారు. అయితే, ఆ సమయంలో ఇంట్లో పవన్‌ ఖేడా లేరని, ప్రస్తుతం ఎక్కడున్నారో తెలియదని అస్సాం డీజీపీ దేబజిత్‌ నాథ్‌ చెప్పారు. ఎక్కడున్నా అరెస్టు చేస్తామని పేర్కొన్నారు. సోదాల్లో కొన్ని ఎలక్ట్రానిక్‌ పరికరాలు, ఖేడాపై నేరారోపణలకు దారితీసే కొన్ని పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఆ వివరాలు ఇప్పుడే వెల్లడించలేమని పేర్కొన్నారు. అస్సాం పోలీసులు ఉదయం 11 గంటలకు పవన్‌ ఖేడా నివాసానికి చేరుకున్నారు. రెండు గంటల తర్వాత వెళ్లిపోయారు. ఈ సోదాల పట్ల కాంగ్రెస్‌ పార్టీ ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ నెల 9న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తప్పదని తేలిపోవడంతో హిమంత ఉక్కిరిబిక్కిరవుతున్నారని, అందుకే ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడింది. హిమంత భార్యపై ఖేడా చేసిన ఆరోపణలను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమర్థించారు. సీఎం భార్యపై ఈడీ లేదా సీబీఐతో దర్యాప్తు జరిపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఖేడాపై కేసును చట్టపరంగా ఎదుర్కొంటామని చెప్పారు. హిమంత, ఆయన కుటుంబ తప్పిదాలను బయటపెడతామన్నారు. తనపై, తన కుటుంబంపై ఆరోపణలకు ఆధారమైన పత్రాలను కాంగ్రెస్‌ సరిచూసుకోలేదని హిమంత ఎద్దేవా చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలన్న ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే వ్యాఖ్యలను ఖండించారు. వృద్ధాప్యంతో ఆయన పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారన్నారు. ''మాపై ఆరోపణలు చేసిన పవన్‌ ఖేడా హైదరాబాద్‌ పారిపోయారు. ఆయన పాతాళంలో దాక్కున్నా పట్టుకోవడం తథ్యం'' అని అన్నారు. నిజాలు తెలుసుకోకుండా ఆరోపణలు చేయడం, వాటిని కాంగ్రెస్‌ నాయకత్వం సమర్థించడం ఏమిటని సీఎం నిలదీశారు. ''ఆరోపణల డాక్యుమెంట్లను ఖేడాకు రాహుల్‌ గాంధీ ఇచ్చి ఉంటారు. కనుక ఈ కేసులో రాహుల్‌ గాందీని చేర్చాల్సి ఉంటుంది'' అని పేర్కొన్నారు.

Post a Comment

0 Comments

Bottom Ad [Post Page]

Advertisement

WearYourDictionary

Random Posts

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Sed ultricies, sapien et auctor bibendum, magna urna posuere purus, at vehicula erat est ac sem.

Copyright

Copyright © 2022 BlogName.
Credits: imamuddinwp

#Advertisement Popup


SVG Icons

Social

sr7themes.eu.org

Newest Post

జాగ్వార్ ల్యాండ్ రోవర్‌లో 4 వేల ఉద్యోగులకు ఉద్వాసన ?

టాటా మోటార్స్‌కు చెందిన లగ్జరీ కార్ల బ్రాండ్ 'జాగ్వార్ ల్యాండ్ రోవర్' (జేఎల్ఆర్) అంతర్జాతీయ మార్కెట్లో ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్...

Total Pageviews

#Advertisement


#Advertisement


Translate

Travel the world

Full width home advertisement

Advertisement

Random Post

Follow us

Pages

Author Description

Hey there! We are Colorlib, crafting beautiful free website templates and themes since 2013. Our designers push the boundaries to deliver high quality templates for bloggers, businesses, and creatives worldwide!

Post Page Advertisement [Top]

Advertisement

Climb the mountains