పశ్చిమ బెంగాల్ ఎన్నికల సందర్భంగా ముర్షీదాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చిన తర్వాత బెంగాల్‌ను సవాలు చేసిన ప్రతి ఒక్కొక్కరి అహంకారం ఛిద్రమైపోతూ వచ్చింది. మొదట బ్రిటీష్, తరువాత కాంగ్రెస్, చివరికి వామపక్షాలు తమ అహంకారంతో కుప్పకూలిపోయాయి. ఇప్పుడు బెంగాల్ ప్రజలు టీఎంసీ అహంకారాన్ని ఛిద్రం చేస్తారని ప్రధాని అన్నారు. ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన టీఎంసీ వాగ్దానాలను నెరవేర్చలేకపోయిందని, అవినీతి వ్యవస్థలను టీఎంసీ ప్రోత్సహించిందని ఆరోపించారు. గతంలో ఉన్న ప్రభుత్వాలకు సంబంధించిన వర్గాలు ప్రస్తుత ప్రభుత్వంలో కొనసాగుతున్నాయని అన్నారు. వామపక్షాలకు చెందిన గూండాలు, సిండికేట్లు అన్నీ తృణమూల్‌లోకి మారాయి. ఆయుధాలు, మాదక ద్రవ్యాలు, పశువుల అక్రమ రవాణా నుంచి కమిషన్ల వరకు అన్నింటిని ఇప్పుడు టీఎంసీ నియంత్రిస్తోందని అన్నారు. దేశ భద్రత తమకు అత్యంత ముఖ్యమైనదని మోడీ చెప్పారు. పశ్చిమ బెంగాల్‌లో యూసీసీ అమలు చేసి, బుజ్జగింపు రాజకీయాలకు ముగింపు పలుకుతామని అన్నారు. టీఎంసీ జంగిల్ రాజ్, సిండికేట్ రాజ్‌కు ముగింపు పలకడమే బీజేపీ లక్ష్యమని తెలిపారు. ఈ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో పరిస్థితి మారుతుందని చెప్పారు.
0 Comments