తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కోసం తమిళగ వెట్రి కజగం మేనిఫెస్టోను విడుదల చేసింది. మహిళలు, రైతులు మరియు బలహీన వర్గాలను లక్ష్యంగా చేసుకుని పలు సంక్షేమ చర్యలను వాగ్దానం చేశారు. విజయ్ తన మేనిఫెస్టోను నిజాయితీకి నిదర్శనంగా అభివర్ణించారు. నిజాయితీ పరిపాలనను తన సిద్ధాంతం టీవీకే పార్టీ అధినేత ప్రకటించారు. అందుకే తమ పార్టీ తొలి ఎన్నికల ప్రణాళిక కూడా నిజాయితీకి హామీలనీ, తాము స్టాలిన్ లాగా ప్రజలను తప్పుదోవ పట్టించమని వెల్లడించారు.. ప్రజలకు ఉత్తుత్తి వాగ్దానాలతో రూపొందించిన తొందరపాటు ఎన్నికల ప్రణాళిక తమది కాదని పేర్కొన్నారు. డీఎంకే, మిగతా పార్టీలన్నీ ఒకటే అని చెప్పాం కదా? కావాలంటే ఇరు పక్షాలు విడుదల చేసిన ఎన్నికల ప్రణాళికలను తీసుకుని పోల్చి చూడండని విజయ్ అన్నారు. మహిళలకు నెలకు రూ. 2,500 సహాయం, పెళ్లి చేసుకునే పేదింటి వధువులకు నాణ్యమైన పట్టు చీరతో పాటు 8 గ్రాముల బంగారం, మహిళలు నడుపుతున్న స్వయం సహాయక బృందాలకు రూ. 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు , బడి మానేయడాన్ని నివారించడానికి తల్లులకు సంవత్సరానికి రూ. 15,000 సహాయం అందిస్తామని విజయ్ హామీ ఇచ్చారు. ప్రధాన పార్టీలు నిజమైన విధాన ప్రత్యామ్నాయాలను అందించడం కంటే, ఒకరిని మించి ఒకరు పోటీ పడాలనే లక్ష్యంతో ఒకే రకమైన వాగ్దానాలతో కూడిన తొందరపాటు ఎన్నికల ప్రణాళికలను జారీ చేస్తున్నాయని ఎద్దేవా ఏశారు. ఈ పార్టీలన్నీ ఒకే గొడుగు కింద పనిచేస్తున్న "అవినీతి ముఠాలు" అని ఆయన ఆరోపించారు. టీవీకే ఓటర్లను అదే విధంగా తప్పుదోవ పట్టించదని అన్నారు.
0 Comments