తనిష్క్ బ్రాండ్ అంబాసిడర్ గా కన్నడ నటి రుక్మిణి వసంత్‌

Wednesday, April 8, 2026

business Festival of Exchange facility Kannada Actress Rukmini Vasanth Named Tanishq Brand Ambassador south india

t f B! P L


దక్షిణ భారతదేశంలో నూతన ప్రచారకర్తగా కన్నడ నటి రుక్మిణి వసంత్‌ను  జ్యువెలరీ బ్రాండ్ తనిష్క్, ఎంచుకుంది. సంప్రదాయం మరియు ఆధునికత కలబోసిన దక్షిణ భారత మహిళా శక్తికి ఆమెను ప్రతీకగా తనిష్క్ పరిచయం చేసింది. పచ్చలు, కెంపులు, నీలమణి వంటి సహజ రత్నాలతో రూపొందించిన ‘హ్యూస్’ కలెక్షన్ ప్రచారంలో ఆమె భాగస్వామ్యం ఈ బ్రాండ్‌కు కొత్త ఊపును ఇవ్వనుంది. ఈ అక్షయ తృతీయ వేళ, కేవలం పెట్టుబడి కోణంలోనే కాకుండా, నిత్యజీవితంలో ఫ్యాషన్‌గా ధరించేలా ఈ ఆభరణాలను తీర్చిదిద్దారు. తనిష్క్ ఆవిష్కరించిన ఈ కొత్త శ్రేణిలో రత్నాలే ప్రధాన ఆకర్షణ. కచ్చితమైన కోతలతో కూడిన కాబోచాన్-కట్ రాళ్లను వాడటం వల్ల ఈ ఆభరణాలకు ఒక విలక్షణమైన శిల్పకళా సౌందర్యం లభించింది. పచ్చలు, నీలమణి, సిట్రిన్ వంటి విలువైన సహజ రత్నాలను ఎంతో నాణ్యతా ప్రమాణాలతో ఎంపిక చేశారు. ఈ కలెక్షన్‌లో కేవలం భారీ నెక్ పీస్‌లే కాకుండా, రోజువారీ కార్యాలయాలకు లేదా చిన్న చిన్న వేడుకలకు ధరించేలా లైట్ వెయిట్ ఉంగరాలు, చెవిరింగులు మరియు పెండెంట్ సెట్లను కూడా రూపొందించారు. వీటి ప్రారంభ ధర రూ. 35,000గా నిర్ణయించి, మధ్యతరగతి మరియు ఎగువ మధ్యతరగతి వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చారు. అక్షయ తృతీయను పురస్కరించుకుని తనిష్క్ తన వినియోగదారుల కోసం ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటించింది. ఆభరణాల తయారీ ఛార్జీలపై 20% వరకు తగ్గింపుతో పాటు, బంగారు ఆభరణాల కొనుగోలుపై ప్రతి గ్రాముకు రూ. 201 ఫ్లాట్ డిస్కౌంట్‌ను అందిస్తోంది. అలాగే, పాత బంగారాన్ని ఎక్స్ఛేంజ్ చేసుకునే ‘ఫెస్టివల్ ఆఫ్ ఎక్స్ఛేంజ్’ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది.

Random Post

    Total Pageviews

    Search This Blog

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ