Ad Code

దక్షిణ కొరియాతో కీలక రంగాల్లో భాగస్వామ్యం కుదుర్చుకున్న భారత్ !


క్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యూంగ్ సోమవారం ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. ఇరుదేశాల ప్రతినిధుల సమక్షంలో పలు రంగాలకు సంబంధించిన అవగాహన ఒప్పందాలు జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సంయుక్త మీడియా సమావేశంలో ప్రధాని మోడీ మాట్లాడుతూ, ఇరుదేశాల మధ్య బంధం సరికొత్త స్థాయికి చేరుకుందని హర్షం వ్యక్తం చేశారు. "చిప్స్ నుంచి షిప్స్ వరకు, టాలెంట్ నుంచి సాంకేతికత వరకు, ఎంటర్‌టైన్‌మెంట్ నుంచి ఎనర్జీ వరకు ప్రతి రంగంలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకునేలా మేము ఒప్పందాలు చేసుకున్నాం" అని మోడీ అన్నారు. భారత్-దక్షిణ కొరియా మధ్య వాణిజ్య బంధాన్ని మరింత విస్తరించాలని ఇరుదేశాధినేతలు నిర్ణయించారు. పరస్పర వాణిజ్య ఒప్పందాల విలువను 2030 నాటికి 50 బిలియన్ డాలర్లకు చేర్చడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ప్రధాని వెల్లడించారు. సెమీకండక్టర్లు, షిప్ బిల్డింగ్ మరియు గ్రీన్ ఎనర్జీ రంగాల్లో దక్షిణ కొరియా టెక్నాలజీ భారత్‌కు ఎంతో కీలకం కానుంది.

Post a Comment

0 Comments

Close Menu