ఛత్తీస్‌గఢ్‌లోని జష్‌పూర్ జిల్లాలో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడం కోసం గాల్లోకి టేకాఫ్ అయిన ఓ ప్రైవేట్ జెట్ జష్‌పూర్-నారాయణ్‌పూర్ ప్రాంతంలో కొండను ఢీకొట్టి ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో పైలట్, కో-పైలట్ మరణించినట్లు అనుమానిస్తున్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ప్రైవేట్ జెట్ అటవీ ప్రాంతంలోని ఒక చెట్టును ఢీకొన్న తర్వాత కిందకు పడిపోయింది. జష్‌పూర్-నారాయణ్‌పూర్ సరిహద్దులోని కొండపై కూలిన విమానం నుండి దట్టమైన పొగ మరియు మంటలు ఎగసిపడుతున్న దృశ్యాలు ఘటనా స్థలంలో కనిపించాయి. ప్రమాదానికి గురైన ఆ విమానంలో మొత్తం ఎంత మంది ప్రయాణికులు ఉన్నారు? వారిలో ఎందరు మరణించారు, ఎందరు గాయపడ్డారు? అనే వివరాలపై ఇంకా అధికారిక ప్రకటన వెల్లడికాలేదు.
0 Comments