Ad Code

లోక్‌సభ సీట్ల పెంపుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రధానికి సీఎం రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ


లోక్‌సభ సీట్ల పెంపుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీకి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగా లేఖ రాశారు. లేఖలో మూడు అంశాలను రేవంత్‌రెడ్డి ప్రస్తావించారు. మహిళా రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. డీలిమిటేషన్‌ను సీట్ల పెంపుతో కలపడం సరికాదని, జనాభా ఆధారంగా సీట్లు పెంచితే దక్షిణాదికి నష్టం అన్నారు. ఆర్థిక, అభివృద్ధి ప్రమాణాలు కూడా పరిగణనలోకి తీసుకోవాలని రేవంత్‌ సూచించారు. అన్ని పార్టీలతో చర్చలు జరపాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. దేశ ఐక్యతకు న్యాయమైన ప్రతినిధిత్వం కీలకమన్న రేవంత్‌.. మహిళా రిజర్వేషన్ బిల్లుకు పూర్తి మద్దతు ఇస్తామని చెప్పారు. ప్రస్తుత 543 సీట్లతోనే మహిళా రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలి. మహిళా రిజర్వేషన్, డిలిమిటేషన్, సీట్ల పెంపు మూడు వేర్వేరు అంశాలు. డిలిమిటేషన్‌ను సీట్ల పెంపుతో కలపడం సరైంది కాదని సీఎం రేవంత్‌ స్పష్టం చేశారు.

Post a Comment

0 Comments

Close Menu