Ad Code

భార్య, భర్తల మధ్య పాలు పొంగిన వివాదం : ఉరివేసుకొని చనిపోయిన భర్త !


ఆంధ్రప్రదేశ్ లోని కడప బాలాజీనగర్‌కు చెందిన వెంకట సుబ్బయ్య, అనురాధ దంపతులు ఇద్దరు కుమార్తెలతో జీవనం సాగిస్తున్నారు. గల్ఫ్‌లో పనిచేసి వచ్చిన వెంకటసుబ్బయ్య ఇటీవల స్వగ్రామంలో చిన్న దుకాణం పెట్టుకుని జీవితం కొనసాగిస్తున్నారు. అయితే ఆదివారం నాడు స్టవ్‌పై పెట్టిన పాలు పొంగిపోవడం భార్య, భర్తల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో భర్త సుబ్బయ్య నీకు ఎన్ని సార్లు చెప్పినా ప్రయోజనం లేదంటూ కోపంతో తలను గోడకేసి కొట్టుకునే క్రమంలో చిన్నగాయమైంది. దీంతో భయపడిన భార్య అనురాధ బయటికి వచ్చి కూర్చున్నట్టు చెబుతున్నారు. ఆమె కొద్ది సేపటికి ఇంట్లోకి వెళ్లి చూడగా భర్త ఫ్యాన్‌కు వేలాడుతుండడంతో కేకలు వేయగా, చుట్టుపక్కల వారు వచ్చి వెంకట సుబ్బయ్యను కిందికి దించిన కొద్దిసేపటికే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. 

Post a Comment

0 Comments

Close Menu