చైనా మార్కెట్లో హానర్ ప్లే 80 ప్రోను విడుదల చేసింది. భారీ బ్యాటరీ, పెద్ద డిస్‌ప్లే, సరసమైన ధర వంటి ఫీచర్లతో ఈ ఫోన్ వినియోగదారులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా లాంగ్ బ్యాటరీ బ్యాకప్ కోరుకునే వారికి ఈ ఫోన్ ఒక మంచి ఆప్షన్‌గా భావిస్తున్నారు. ఈ ఫోన్‌లో 7,000mAh భారీ బ్యాటరీను అందించారు. సాధారణ వాడకంలో ఒకసారి ఛార్జ్ చేస్తే రెండు నుంచి మూడు రోజుల వరకు బ్యాకప్ ఇస్తుందని కంపెనీ తెలిపింది. గేమింగ్, వీడియో స్ట్రీమింగ్ వంటి వినియోగాల్లో కూడా ఎక్కువ సమయం పాటు బ్యాటరీ నిలబడటం ఈ ఫోన్ ప్రత్యేకత. 6.8 అంగుళాల TFT LCD స్క్రీన్ ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేయడంతో స్క్రోలింగ్ చాలా స్మూత్‌గా ఉంటుంది. 850 నిట్‌ల బ్రైట్‌నెస్ కారణంగా బయట కూడా క్లియర్ విజిబిలిటీ ఉంటుంది. దీనిలో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6s Gen 3 5G చిప్‌సెట్‌ను అమర్చారు. ఇది రోజువారీ పనులు, మల్టీటాస్కింగ్, గేమింగ్ వంటి అవసరాలను సులభంగా హ్యాండిల్ చేస్తుంది. 5G కనెక్టివిటీతో వేగవంతమైన ఇంటర్నెట్ అనుభవం కూడా లభిస్తుంది. ఈ ఫోన్ 6GB, 8GB, 12GB RAM ఆప్షన్లలో అందుబాటులో ఉంది. అన్ని వేరియంట్లలో 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ఇవ్వడం పెద్ద ప్లస్ పాయింట్. భారీ ఫైల్స్, వీడియోలు స్టోర్ చేసుకునేందుకు సరిపడా స్థలం ఉంటుంది. ఫోటోగ్రఫీ కోసం 50MP ప్రైమరీ కెమెరాను అందించారు. f/1.8 అపెర్చర్‌తో తక్కువ కాంతిలో కూడా మంచి ఫోటోలు తీయవచ్చు. సెల్ఫీల కోసం 5MP ఫ్రంట్ కెమెరా ఉంది. AI ఫీచర్లతో ఫోటో క్వాలిటీ మెరుగ్గా ఉంటుంది. ఈ ఫోన్ Android 15 ఆధారిత MagicOS 9పై నడుస్తుంది. యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్‌ఫేస్‌తో పాటు కొత్త ఫీచర్లు అందుబాటులో ఉంటాయి. IP65 రేటింగ్‌తో దుమ్ము, నీటి నుంచి రక్షణ కూడా లభిస్తుంది. అజూర్ స్కై, బ్లాక్ ఫాంటమ్ నైట్, వైట్ మూన్‌లైట్ రంగుల్లో లభిస్తుంది. త్వరలో ఇతర దేశాల్లో కూడా ఈ ఫోన్ విడుదలయ్యే అవకాశం ఉంది.
0 Comments