Ad Code

త్వరలో మోటోరోలా నుంచి రేజర్ 70 అల్ట్రా ఫోన్


మోటోరోలా నుంచి రేజర్ 70 అల్ట్రా ఫోన్ ఏప్రిల్ చివరలో లేదా మే మొదటి వారంలో విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 6.9 అంగుళాల డిస్ప్లే కలిగి ఉన్న ఈ ఫోన్ 165hz రిఫ్రెష్‌ రేటు కలిగి ఉంటుంది. ఈ ఫోన్ మడత పెట్టినప్పుడు 4 అంగుళాలు మాత్రమే కనిపిస్తుంది. ఈ మొబైల్ మడతపెట్టి ఉన్నప్పటికి కూడా యాప్స్ వాడుకునేలా సెటప్ చేశారు. బ్యాక్ కెమెరా 50 ఎంపీ కాగా సెల్ఫీల కోసం 32 MP కెమెరాలు అందిస్తున్నారు. 4500 mah బ్యాటరీ సామర్థ్యంతో ఈ ఫోన్ లాంచ్ చేసేందుకు కంపెనీ నిర్ణయం తీసుకుంది. 45W వైర్డ్ ఫాస్ట్ ఛార్జర్ సపోర్ట్ చేయనుంది. మిడ్ నైట్ బ్లూ, స్ప్రింగ్ గ్రీన్, పీచ్ ఫజ్ లాంటి కలర్స్ లో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. సాంసంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ పోలికలతో ఈ మోటోరోలా రేజర్ 70 అల్ట్రా మొబైల్ ఉండనుంది.

Post a Comment

0 Comments

Close Menu