దేశీయ మార్కెట్లో టెక్నో పాప్ ఎక్స్ 5జీని ప్రవేశపెట్టింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఏప్రిల్ 24 నుంచి అమెజాన్‌లో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. బడ్జెట్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని రూపొందించిన ఈ ఫోన్, కనెక్టివిటీ సమస్యలు ఉన్న ప్రాంతాల్లో కూడా నిరాటంక కమ్యూనికేషన్ అందించాలనే ఉద్దేశంతో రూపొందించబడింది. బడ్జెట్ ధరలోనే పెద్ద బ్యాటరీ, స్మార్ట్ ఫీచర్లు, ప్రత్యేక కమ్యూనికేషన్ టెక్నాలజీతో వచ్చిన ఈ ఫోన్, రోజువారీ వినియోగదారులకు మంచి ఎంపికగా నిలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.78 అంగుళాల HD+ డిస్‌ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉండటం వల్ల స్క్రోలింగ్, గేమింగ్, వీడియో వీయింగ్ మరింత స్మూత్‌గా అనిపిస్తుంది. పెద్ద స్క్రీన్ కారణంగా వినియోగదారులకు మంచి విజువల్ అనుభవం లభిస్తుంది. పర్ఫార్మెన్స్ కోసం మీడియాటెక్ డిమెన్సిటీ 6400 ప్రాసెసర్‌ను అమర్చారు. ఇది రోజువారీ పనులు, మల్టీటాస్కింగ్‌ను సులభంగా నిర్వహించగలదు. 4GB మరియు 6GB RAM వేరియంట్లతో పాటు 128GB స్టోరేజ్ అందుబాటులో ఉంది. మైక్రో SD కార్డ్ ద్వారా 2TB వరకు స్టోరేజ్‌ను విస్తరించుకోవచ్చు. 6500mAh భారీ బ్యాటరీ ఈ ఫోన్‌లో ప్రధాన ఆకర్షణ. ఒకసారి ఛార్జ్ చేస్తే ఎక్కువసేపు వినియోగించుకోవచ్చు. 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటం వల్ల తక్కువ సమయంలోనే బ్యాటరీ రీచార్జ్ అవుతుంది. 8.18mm సన్నని డిజైన్‌తో పాటు ఏరోస్పేస్-గ్రేడ్ అల్యూమినియం కెమెరా మాడ్యూల్‌తో ఇది స్టైలిష్‌గా కనిపిస్తుంది. IP64 రేటింగ్‌తో ధూళి, నీటి చినుకుల నుంచి రక్షణ లభిస్తుంది. ఈ ఫోన్‌లో "ఫ్రీలింక్ కమ్యూనికేషన్" అనే ప్రత్యేక ఫీచర్ ఉంది. మొబైల్ నెట్‌వర్క్ లేకపోయినా సమీపంలోని ఇతర డివైజ్‌లతో కనెక్ట్ అవ్వవచ్చు. దాదాపు 1.5 కిలోమీటర్ల పరిధిలో కాల్స్, మెసేజ్‌లు, ఫైల్ షేరింగ్ చేయగలగడం దీనిని ప్రత్యేకంగా నిలబెడుతోంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత HiOS 16పై ఈ ఫోన్ పనిచేస్తుంది. AI నాయిస్ క్యాన్సిలేషన్, AI రైటింగ్ అసిస్టెంట్, AI ఎరేసర్ 2.0, AI ఇమేజ్ ఎక్స్‌టెండర్ వంటి ఆధునిక ఫీచర్లు యూజర్ అనుభవాన్ని మెరుగుపరుస్తాయి. ఫోటోగ్రఫీ కోసం 13MP రియర్ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరా అందించారు. రోజువారీ ఫోటోలు, వీడియో కాల్స్, సోషల్ మీడియా వినియోగానికి ఇది సరిపోతుంది. 4GB + 128GB వేరియంట్ ధర ₹15,999 కాగా, 6GB + 128GB వేరియంట్ ₹17,999గా నిర్ణయించారు.
0 Comments