ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా పోలీసులు క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడుతున్న బుకీలను అరెస్ట్ చేశారు. నరసరావుపేటలోని ఐలా బజార్ లో బెట్టింగ్ జరుగుతోందనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు మొత్తం ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రూ.4.58 లక్షలు, ల్యాప్టాప్, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులను డీఎస్పీ అభినందించి, రివార్డ్స్ అందజేశారు.
0 Comments