అమెరికా-ఇజ్రాయెల్‌తో జరిగిన యుద్ధంతో తమకు రూ.25 లక్షల కోట్ల నష్టం జరిగినట్లు ఇరాన్ వెల్లడించింది. ఇది ప్రాథమిక అంచనా మాత్రమేనని, ఇంకా ఎక్కువే నష్టం ఉండొచ్చని తెలిపింది. దాడులకు బాధ్యులైన దేశాల నుంచి నష్ట పరిహారం కోరతామని ప్రకటించింది. అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య దాదాపు 40 రోజులపాటు యుద్ధం జరిగింది. యుద్ధం మొదటి రోజే అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మృతి చెందాడు. ఆయనతోపాటు పలువురు ఉన్నతాధికారులు కూడా ప్రాణాలు కోల్పోయారు. దీంతో గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు చేసింది. ఇరు దేశాల దాడులతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అయితే, ఇటీవల ట్రంప్ పిలుపుతో ఇరాన్ షరతులతో కూడిన కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించిన సంగతి తెలిసిందే.
0 Comments