Ad Code

భారతీయుల్లో ఆందోళనలు సృష్టించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది !


రాన్, అమెరికా-ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధానికి సంబంధించి భారతీయుల్లో ఆందోళనలు సృష్టించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆరోపించారు. జాతీయ ప్రయోజనాల విషయంలో ఆ పార్టీ విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో భయాందోళనలు సృష్టించి తనను వేధించాలని చూస్తున్నారని అన్నారు. మనదేశ అభివృద్ధిని జీర్ణించుకోలేని శక్తుల చేతుల్లో కాంగ్రెస్ కీలుబొమ్మగా మారుతోందని ఆరోపించారు. అసోం ప్రజలు ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీని ఎప్పుడో తరిమి కొట్టారని కితాబిచ్చారు. రానున్న ప్రతి ఎన్నికల్లో ప్రతి రాష్ట్రం కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెబుతుందని అన్నారు. అసోం పట్ల లేదా దేశం పట్ల కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదని విమర్శించారు.

Post a Comment

0 Comments

Close Menu