Ad Code

హెచ్‌సీఏ ట్రెజరర్గా అనిల్ కుమార్ ఎన్నిక


హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) కొత్త ట్రెజరర్‌గా కె. అనిల్ కుమార్ విజయం సాధించారు. ఆదివారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఎన్నికల్లో అనిల్ తన సమీప ప్రత్యర్థి ఆర్ హరినారాయణ రావుపై రెండు ఓట్ల తేడాతో గెలుపొందారు.ఈ పోలింగ్‌లో అనిల్ కుమార్‌కు 61 ఓట్లు రాగా, హరినారాయణ రావుకు 59 ఓట్లు వచ్చాయి.ఇతర అభ్యర్థులు వి. ఆగం రావుకు 27 ఓట్లు, సి. బాబురావుకు 6 ఓట్లు లభించాయి. ఈ పోలింగ్ లో మొత్తం175 మంది ఓటర్లకు గాను 153 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సెక్రటరీ పదవికి ఏకగ్రీవంగా ఎన్నికైన ఎం. జీవన్ రెడ్డితో పాటు అనిల్‌కు ఎలక్టోరల్ ఆఫీసర్ వీసీ సంపత్ ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. గతంలో సెక్రటరీ, ట్రెజరర్‌గా పనిచేసిన ఆర్. దేవరాజ్, సీజే శ్రీనివాస్ రావు పదవీకాలం ముగియడంతో ఈ ఎన్నికలు నిర్వహించారు.

Post a Comment

0 Comments

Close Menu