Ad Code

క్యూబాలో తీవ్ర రూపం దాల్చిన విద్యుత్ సంక్షోభం !


క్యూబాలో విద్యుత్ సంక్షోభం తీవ్ర రూపం దాల్చింది. ప్రస్తుతం ఆ దేశంలో 10 నుంచి 20 గంటలకు పైగా విద్యుత్ కోతలు కొనసాగుతండగా శనివారం క్యూబా రాజధాని హవానాతో పాటు దేశమంతటా విద్యుత్ సరఫరా నిలిచిపోయినట్లు క్యూబా ప్రభుత్వం వెల్లడించింది. గత ఐదు రోజుల్లో ఇలా దేశవ్యాప్తంగా పవర్ గ్రిడ్ కుప్పకూలడం ఇది రెండోసారి. అమెరికా విధిస్తున్న చమురు దిగ్బంధం కారణంగా క్యూబా తీవ్ర ఇంధన కొరతను ఎదుర్కొంటోంది. జనవరి 3న వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను యూఎస్ ప్రభుత్వం బంధించింది. అప్పటి నుంచి క్యూబాకు చమురు కష్టాలు ఏర్పడ్డాయి. క్యూబా అవసరాలకు పెద్ద ఎత్తున చమురు వెనిజులా నుంచే దిగుమతి అవుతుడగా మదురో అరెస్టుతో క్యూబాకు ఎటువంటి చమురు దిగుమతులు జరగలేదు. దీనికి తోడు మదురో అరెస్టు విషయంలో ట్రంప్ నిర్ణయాన్ని క్యూబా ప్రభుత్వం వ్యతిరేకించిందని దీంతో క్యూబాకు ఏ ఇతర దేశాలు ఇంధనం సరఫరా చేయవద్దంటూ ట్రంప్ ఆంక్షలు విధించారు. దీంతో చమురు దిగుమతులు జరగలేదు. దీనివల్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు పనిచేయడం లేదు. విద్యుత్ ఉత్పత్తి లేక కోతలు క్రమంగా విధిస్తున్న క్యూబా ప్రభుత్వం తాజా దేశవ్యాప్తంగా బ్లాకౌట్ లోకి వెళ్లింది. విద్యుత్ సరఫరా లేక సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హారం, మందులు, ఇతర కనీస అవసరాల కొరతతో ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. 

Post a Comment

0 Comments

Close Menu