ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ తొలగిస్తున్నట్లు ప్రకటించిన మెటా

Saturday, March 14, 2026

2026 after May 8 Meta Announces Removal of End-to-End Encryption our chats may no longer remain completely private science technology

t f B! P L


మెసేజింగ్ సెక్షన్‌లో ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ అనే ప్రొటెక్షన్ ను 8 మే 2026 తర్వాత తొలగిస్తున్నట్లు మెటా ప్రకటించింది. దీనివల్ల మనం చేసే చాటింగ్ ఇకపై పూర్తి రహస్యంగా ఉండకపోవచ్చు. సాధారణంగా మనం ఎవరికైనా మెసేజ్ పంపితే, అది పంపిన వారికి లేదా పొందిన వారికి మాత్రమే కనిపిస్తుంది. మధ్యలో మెటా సంస్థ కూడా ఆ మెసేజ్‌లను చూడలేదు. దీనినే 'ఎన్‌క్రిప్షన్' అంటారు. కానీ మే 8 తర్వాత ఈ ప్రొటెక్షన్ పోతుంది. దింతో అవసరమైతే మెటా సంస్థ మన చాట్‌ మెసేజులను చూసే అవకాశం ఉంటుంది. ఈ మార్పు వల్ల పాత మెసేజెస్ లేదా ఫోటోలు, ఏవైనా డేటా పోతాయని అనిపిస్తే, వాటిని సేవ్ చేసుకొని డౌన్‌లోడ్ చేసుకోవాలని మెటా సూచించింది. పాత చాట్స్ డౌన్‌లోడ్ చేసుకునే ముందు ఇన్‌స్టాగ్రామ్ యాప్‌ను లేటెస్ట్ వెర్షన్‌కి అప్‌డేట్ చేసుకోవాలి. చాట్స్ ఈ మార్పు వల్ల ప్రభావితం అవుతుంటే, యాప్‌లోని మెసేజింగ్ ట్యాబ్ కింద దీనికి సంబంధించిన సూచనలు కనిపిస్తాయి. ఇప్పటివరకు మనం పంపే ప్రతి మెసేజ్, వీడియో లేదా ఆడియో కాల్‌కి ఒక 'డిజిటల్ లాక్' ఉండేది. ఆ లాక్ తీసే కీ కేవలం మెసేజ్ పంపిన వారి దగ్గర, పొందిన వారి దగ్గర మాత్రమే ఉంటుంది. దీనివల్ల హ్యాకర్లు గానీ, కంపెనీలు గానీ మన ప్రైవేట్ విషయాలను చూడలేవు. మే 8, 2026 తర్వాత ఈ 'డిజిటల్ లాక్' సిస్టమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పని చేయదు.

Advertisement

Random Post

    Total Pageviews

    Search This Blog

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    Featured Post

    QooQ