కేంద్ర మంత్రివర్గం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రాంతీయ విమాన కనెక్టివిటీని బలోపేతం చేయడం, వెనుకబడిన ప్రాంతాలలో విమానయాన మౌలిక సదుపాయాలను విస్తరించడం లక్ష్యంగా మొత్తం రూ.28,840 కోట్ల వ్యయంతో సవరించిన ఉడాన్ (ఉడే దేశ్ కా ఆమ్ నాగ్రిక్) పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపినట్లు క్యాబినెట్ బ్రీఫింగ్ సందర్భంగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. అలాగే ఇమ్మిగ్రేషన్, వీసా, విదేశీయుల రిజిస్ట్రేషన్ ట్రాకింగ్ ప్రాజెక్టుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. జాతీయ భద్రత కోసం విదేశీయుల ట్రాకింగ్ వ్యవస్థ ఏర్పాటు, ఐవీఎఫ్‌ఆర్‌టీ ప్రాజెక్టు కోసం 1800 కోట్ల రూపాయల ఖర్చుకు క్యాబినెట్ అనుమతినిచ్చింది. పదేళ్ల వ్యవధిలో 28,840 కోట్ల రూపాయలు ఖర్చు ప్రభుత్వం చేయనున్నది. 200 హెలిపాడ్ ల ఆధునీకరణ, ఆపరేషన్ అండ్ మైంటెనెన్స్ కోసం 2,577 కోట్ల రూపాయల ఖర్చు చేయనున్నది. ఎయిర్ లైన్స్ ఆపరేటర్స్ కు వయబులిటీ గ్యాప్ ఫండ్ కింద 10,043 కోట్ల రూపాయల సహాయనుంది. ఈ పథకం కింద కొత్తగా 120 ప్రాంతాలకు ఎయిర్ కనెక్టివిటీ పెరుగుతుంది. పర్యావరణ పరిరక్షణ కోసం నేషనల్ డిటర్మైండ్ కాంట్రిబ్యూషన్ విధానానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
0 Comments