Ad Code

ఆంధ్రప్రదేశ్ లో తగ్గనున్న బ్రాండ్ల లిక్కర్ ధరలు


ఆంధ్రప్రదేశ్ లో బ్రాండెడ్ మద్యం ధరలు తగ్గనున్నాయి. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ ప్రభుత్వానికి తాజాగా ప్రతిపాదనలు అందించింది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో ప్రీమియం బ్రాండ్ల ధరలు చాలా ఎక్కువ గా ఉండటంతో వాటిని భారీగా తగ్గించాలని ఎక్సైజ్ శాఖ ప్రతిపాదించింది. రాష్ట్రంలోకి నాన్‌ డ్యూటీ పెయిడ్‌ లిక్కర్‌ (ఎన్‌డీపీఎల్‌) విచ్చలవిడిగా వస్తోంది. ఒక ఖరీదైన ఫారిన్‌ లిక్కర్‌ సీసా ధర తెలంగాణలో రూ.22 వేలు ఉంటే. అదే బాటిల్‌ను ఏపీలో రూ.25 వేలకు అమ్ముతున్నారు. మరో బ్రాండ్‌ రూ.27 వేలు-రూ.33 వేల తేడా ఉంది. కర్ణాటకతో పోలిస్తే కొన్ని ప్రీమియం బ్రాండ్ల ధరల్లో దాదాపు సగానికి సగం తేడా ఉంది. దీంతో రాష్ట్రంలో ఫారిన్‌ లేదా ప్రీమియం లిక్కర్‌ అమ్మకాలు చాలా తక్కువగా ఉన్నాయి. వీటి అమ్మకాలు పెరగాలంటే ఆ బ్రాండ్ల ధరలు తగ్గాలని ఎక్సైజ్‌ శాఖ ప్రతిపాదించింది. క్యాబినెట్‌లో ఆమోదం పొందిన వెంటనే ధరలు తగ్గనున్నాయి. ఈ నిర్ణయంతో 20 ఖరీదైన బ్రాండ్ల మద్యం ధరలు తగ్గనున్నాయి.

Post a Comment

0 Comments

Close Menu