Ad Code

రాహుల్ గాంధీ దేశాన్ని అపఖ్యాతి పాలు చేస్తున్నారు !


స్సాం పర్యటనలో ఉన్న హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ ప్రధాని మోడీ ని, బీజేపీని వ్యతిరేకించే క్రమంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దేశాన్ని అపఖ్యాతి పాలు చేస్తున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా మండిపడ్డారు. ఇటీవల రాహుల్ గాంధీ పార్లమెంట్ మెట్లపై నిలబడి టీ, పకోడీ తీసుకోవడంపై అమిత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్ అనేది చాలా పవిత్ర స్థలమని, అల్పాహారం ఎక్కడ తీసుకోవాలో కూడా రాహుల్‌కు తెలియదా అని ప్రశ్నించారు. రాహుల్ చర్యలను ఏ భారతీయుడూ సమర్థించడని అన్నారు. ఈ క్రమంలో అస్సాం వైద్యారోగ్య రంగానికి సంబంధించి రూ.2 వేల కోట్ల విలువైన పనులకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం ప్రసంగిస్తూ రాష్ట్రంలో కాంగ్రెస్ గత పాలనపై విమర్శలు గుప్పించారు. 'గత పదిహేనేళ్ల పాలనలో కాంగ్రెస్ అస్సాం వైద్యారోగ్య బడ్జెట్ నుంచి రూ.150 కోట్లు కాజేసింది. ఆ పార్టీ కేవలం తమ కుటుంబాల పాలన కోసమే పని చేసింది. ఆ సమయంలో రాష్ట్రంలో ఆరోగ్య వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండేది' అని అమిత్ షా విమర్శించారు. అస్సాం రాష్ట్రంలోని వైద్య సదుపాయాలను గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక వంటి రాష్ట్రాల స్థాయికి తీసుకురావడానికి సీఎం హిమంత బిశ్వశర్మ ఎంతగానో కృషి చేశారని ప్రశంసించారు. రాష్ట్రంలో అన్ని వర్గాల వారికి అందుబాటు ధరల్లో వైద్య సేవలు అందించేందుకు బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు.

Post a Comment

0 Comments

Close Menu