మహారాష్ట్రలో అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న రిటైర్డ్ మర్చంట్ నేవీ ఆఫీసర్, స్వయం ప్రకటిత జ్యోతిష్కుడు అశోక్ ఖారత్‌తో రాష్ట్ర మహిళా చైర్‌పర్సన్ రూపాలి చకాంకర్ కలిసి ఉన్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో రాజకీయ వివాదం చెలరేగింది. మహిళా చైర్‌పర్సన్స్ పదవికి రూపాలి రాజీనామా చేయాలని డిమాండ్ వినిపిస్తోంది. చైర్‌పర్సన్ పదవికి చకాంకర్ తక్షణమే రాజీనామా చేయాలని వివిధ రాజకీయ పార్టీల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం మహారాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రుపాలి చకాంకర్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అజిత్ పవార్ వర్గానికి చెందిన నాయకురాలు. మహారాష్ట్ర అధికార పార్టీలో బీజేపీ, శివసేన (ఏక్‌నాథ్ షిండే), అజిత్ పవార్ ఎన్సీపీలు భాగస్వాములుగా ఉన్నాయి. తన రాజకీయ-సామాజిక సంబంధాలను ఉపయోగించి, ఆధ్యాత్మిక కర్మకాండల పేరుతో వారిని దుర్వినియోగం చేసినట్లు అధికారులు తెలిపారు. అత్యాచారం, బెదిరింపు సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అదనంగా, అశోక్ ఖారత్‌పై మహారాష్ట్రలో అమలులో అఘోరి ఆచారాలు, నల్లమంత్రికలు వంటి అమానుష పద్ధతుల నిర్మూలన చట్టం కింద కూడా పోలీసులు కేసులు పెట్టారు.
0 Comments