మహారాష్ట్ర మంత్రి నర్హరి జిర్వాల్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆయనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ట్రాన్స్‌జెండర్‌తో మంత్రి సన్నిహితంగా ఉండగా ఈ వీడియో బయటకు వచ్చింది. ఇది ఆయన అధికార నివాసంలో తీసినదని ఆరోపణలు ఉన్నాయి. అయితే వీడియో నిజమా కాదా అన్నది ఇంకా నిర్ధారణ కాలేదు. ఈ ఘటనతో ఎన్‌సీపీపై ఒత్తిడి పెరిగింది. ప్రతిపక్షాలు జిర్వాల్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. సామాజిక కార్యకర్త అంజలి దమానియా కూడా విమర్శలు చేశారు. మరోవైపు పార్టీ నాయకులు ఇది పాత వీడియో కావచ్చని, రాజకీయ కారణాలతో బయటకు వచ్చిందని అంటున్నారు. జిర్వాల్ ఇంకా స్పందించలేదు.
0 Comments