Ad Code

ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్‌ నిఘా వ్యవహారాల మంత్రి ఇస్మాయిల్‌ ఖాతిబ్‌ మృతి ?


రాన్‌ నిఘా వ్యవహారాల మంత్రి ఇస్మాయిల్‌ ఖాతిబ్‌ని చంపినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. దీంతో ఇరాన్ కీలక నేతలే లక్ష్యంగా ఇజ్రాయెల్ పని చేస్తున్నట్లుగా అర్ధమవుతోంది. గత నెల 28న ఇరాన్ అధ్యక్ష భవనంపై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా జరిపిన దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ సహా కుటుంబ సభ్యులు, కీలక ప్రభుత్వ పెద్దలు హతమయ్యారు. ఈ ఘటనలో ఖమేనీ కుమారుడు మోజ్తాబా కూడా తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. ఇంతలోనే ఇరాన్ కీలక నేతలను టార్గెట్‌గా పెట్టుకుని ఇజ్రాయెల్ హతమార్చుతోంది. ఇక ఈ దాడులను రష్యా ఖండించింది. ఇదిలా ఉంటే నిన్న ఇజ్రాయెల్ దాడిలో చనిపోయిన ఇరాన్ భద్రతా అధిపతి అలీ లారిజానీ అంతిమయాత్రకు వేలాది మంది ప్రజలు తరలివచ్చారు. పెద్ద ఎత్తున నివాళులర్పించారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

Post a Comment

0 Comments

Close Menu