Ad Code

చర్చలు, సంప్రదింపులు ద్వారానే సమస్యలు పరిష్కారం !


రాన్ పై అమెరికా - ఇజ్రాయిల్  దళాలు జరుపుతున్న దాడులపై కేంద్ర మంత్రి జయశంకర్‌ ఈరోజు రాజ్యసభలో మాట్లాడుతూ  ఎటువంటి సమస్యనైనా పరిష్కరించేందుకు చర్చలు, సంప్రదింపులు నిర్వహించాలని తాము విశ్వసిస్తామని, పశ్చిమాసియాలో జరుగుతున్న పరిణామాలను ప్రధాని మోడీ నిశితంగా పరిశీలిస్తున్నారని ఆయన అన్నారు. సంక్షోభం మొదలైన నాటి నుంచి పశ్చిమాసియాలో ఉన్న ఉద్రిక్త పరిస్థితుల్ని ఎప్పటికప్పడు అంచనా వేస్తున్నామని, ఆయా దేశాల్లో చిక్కుకున్న భారతీయుల్ని వెనక్కి తీసుకువచ్చేందుకు అన్ని ప్రయత్నాలు జరుగుతున్నట్లు చెప్పారు. ఇరాన్‌లో వేలాది మంది భారతీయులు ఉన్నారని, కొందరు చదువు కోసం వెళ్లగా, మరికొందరు ఉద్యోగం కోసం వెళ్లినట్లు తెలిపారు. మన దేశ ఇంధన భద్రతకు ఆ ప్రాంతం చాలా కీలకమైందని, ఆయిల్, గ్యాస్ సరఫరా చేస్తున్న కంపెనీలు ఉన్నాయన్నారు. ఇరాన్‌కు అత్యవసరం కానటువంటి పర్యటన చేయవద్దని భారతీయులకు సలహా ఇచ్చినట్లు మంత్రి వెల్లడించారు. ఇరాన్ నాయకులతో గతంలో సంప్రదించామని, కానీ ఈ దశలో చాలా కష్టంగా ఉన్నట్లు మంత్రి చెప్పారు. ఫిబ్రవరి 28వ తేదీన ఇరాన్ విదేశాంగ మంత్రి అరాకచితో మాట్లాడానని, ఆ తర్వాత మార్చి 5వ తేదీన కూడా చర్చించినట్లు వెల్లడించారు. రాబోయే రోజుల్లోనూ ఇరాన్‌తో ఉన్నత స్థాయి సంప్రదింపులు జరపనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం కొచ్చిలో ఉన్న ఇరాన్ నౌక గురించి కూడా సభలో చర్చించనున్నట్లు ఆయన తెలిపారు. చమురు మార్కెట్‌ను అంచనా వేసి, దాని ప్రకారమే భారతీయులకు ఇంధన భద్రత కల్పించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. 

Post a Comment

0 Comments

Close Menu