Ad Code

ఎక్స్‌లో అశ్లీల కంటెంట్‌ నిషేధం?


భారత ప్రభుత్వం ఎక్స్ లో అశ్లీల కంటెంటుపై పరిమితులు విధించినట్లు కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై ఎక్స్ యూజర్లు సైతం స్పందిస్తున్నారు. భారత ప్రభుత్వం సాధారణంగా అడల్ట్ కంటెంట్ నిషేధంపై చాలా సీరియస్‌గా ఉంది. ఇందులో భాగంగానే ఇప్పటికే ఇలాంటి కంటెంట్ అందించే చాలా ప్లాట్‌ఫామ్‌ల మీద కఠిన చర్యలు తీసుకుంది. అయితే ఇప్పుడు ఎక్స్‌కు కూడా పరిమితులు విదించిందా? అనే విషయంపై అధికారిక ప్రకటన వెలువడలేదు. భారతదేశంలో ఎక్స్‌లో 18+ కంటెంట్ నిషేధంపై మస్క్ కూడా అధికారికంగా వెల్లడించలేదు. కానీ సోషల్ మీడియా వేదికగా యూజర్లు దీనికి సంబంధించిన పోస్టులు చేస్తూనే ఉన్నారు. ఆ పోస్టుల ప్రకారం.. అడల్ట్ కంటెంట్ తొలగిస్తున్నట్లు తెలుస్తోంది.

Post a Comment

0 Comments

Close Menu