Ad Code

నియోజకవర్గాల డిలిమిటేనేషన్‌ను స్వాగతిస్తున్నాం !


బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడుతూ నియోజకవర్గాల డిలిమిటేనేషన్‌ను స్వాగతిస్తున్నామన్నారు. డిలిమిటేషన్‌ అనేది ఎప్పుడో జరగాలని, ఇ‍ప్పటికే ఆలస్యమైందన్నారు. ఏపీ విభజన చట్టంలోనే నియోజకవర్గ పునర్విభజన హామీ ఉందని, పార్లమెంట్‌లో దక్షిణాదికి 24 శాతం ప్రాతినిధ్యం ఉందని దానిని యథావిధిగా కొనసాగించాలన్నారు. కేంద్రం దక్షిణానికి అన్యాయం చేస్తుందని నేను అనుకోను. దక్షిణాది కుటుంబ నియంత్రణను బాగా పాటించింది. కుటుంబ నియంత్రణ పాటించని వారికి నజరానా.. పాటించిన వారికి జురుమానా అంటే కుదురదు. ఆలాంటి తప్పు ప్రభుత్వం చేస్తుందని అనుకోను. డీలిమిటేషన్ జరిగితే ప్రజలకు సేవ చేసే అవకాశం ఎక్కువ మందికి వస్తుంది. అశ్వారావుపేటలో ఒక లక్షా 30వేల ఓట్లు ఉంటే.. శేరిలింగంపల్లిలో 9లక్షల ఓట్లు ఉన్నాయి. డిలిమిటేషన్‌తో ఈ వ్యత్యాసం పోతుంది' అని కేటీఆర్‌ అన్నారు ఫార్ములా రేస్‌ కేసు గురించి కేటీఆర్‌ మాట్లాడుతూ ఆరు గ్యారంటీల డైవర్షన్‌ కోసమే ఈ ఫార్ములా కేసు. చార్జ్‌షీట్‌. ప్రజల దృష్టిని మరల్చడానికి చార్జ్‌షీట్‌ వ్యవహారం. ఫార్ములా ఈ-రేసింగ్‌ కేసు లొట్టపీస్‌ కేసు. నేను మొదటి నుంచి చెప్తొన్న.. ఇది లొట్ట పీస్‌ కేసు. న్యాయస్థానాల్లో ఫార్ములా ఈ -రేసు కేసు నిలబడదు. ఈకేసులో ఎవరికైతే లబ్ధి జరిగిందని చెప్తున్నారో.. వారితో రేవంత్ దావోస్ లో మంతనాలు జరిపారు. కక్ష ఉంటే నామీద తీర్చుకోండి. అధికారులను ఎందుకు బలి చేస్తున్నారు?, డబ్బులు చెల్లింపుపై నేనే మంత్రిగా నిర్ణయం తీసుకున్నాను. దమ్ముంటే నామీద చర్యలు తీసుకోవాలి. ఎక్కడా డబ్బులు దారి మళ్ళలేదు. తప్పు జరగలేదు. బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సక్షన్ జరిగింది. అరెస్ట్‌ల గుంరించి రేవంత్ రెండేళ్ళుగా చెప్తూనే ఉన్నారు. రిమాండ్‌కు పంపేది కోర్టులు, రేవంత్ రెడ్డి కాదు' అని పేర్కొన్నారు. 

Post a Comment

0 Comments

Close Menu