Ad Code

రాష్ట్రంలో ఎల్‌పీజీ సిలిండర్లకు కొరత లేదు : తెలంగాణ పౌర సరఫరాల సంస్థ ప్రకటన


తెలంగాణ రాష్ట్రంలో ఎల్‌పీజీ సిలిండర్లకు కొరత లేదని రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. రాష్ట్రంలో నిన్న 2 లక్షల 35 వేల 678 ఎల్‌పీజీ సిలిండర్లను డెలివరీ చేసినట్లు తెలిపింది. ఎల్‌పీజీ సిలిండర్లు రీ ఫిల్లింగ్ కోసం ఆందోళన చెందవద్దని వినియోగదార్లకు ప్రభుత్వం సూచించింది. సిలిండర్ల డెలివరీలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా మానిటరింగ్ చేయడానికి పౌర సరఫరాల సంస్థ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేసింది. సగటున రోజుకు 2,15,151 ఎల్‌పీజీ సిలిండర్లు పంపిణీ జరిగేవని.. నిన్న అంతకు మించి డెలివరీ అయినట్లు ప్రభుత్వం వెల్లడించింది. నిన్న ఐఓసీఎల్ నుండి 93,887(+1%) సిలిండర్లు, హెచ్పీసీఎల్ నుండి 84,156 (+11,98%)సిలిండర్లు, బీపీసీఎల్ నుండి 57,635 (+22.63%)సిలిండర్లు మొత్తం 2,35,678 సిలిండర్లు పంపిణీ జరిగినట్లు పౌర సరఫరాల శాఖ తెలిపింది.

Post a Comment

0 Comments

Close Menu