Ad Code

వేరే వ్యక్తిని పెళ్లిచేసుకుందన్న కక్షతో యువతిపై కత్తితో దాడి చేసిన యువకుడు


హైదరాబాద్‌లోని మియాపూర్‌లో తనను కాదని మరొకరిని పెళ్లి చేసుకుందన్న ఆగ్రహంతో అలీషా అలియాస్ పాండు, తన తండ్రి లాలూతో కలిసి నూకరత్నం (25) అనే యువతిపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘటనలో యువతి తీవ్రంగా గాయపడింది. దాడి అనంతరం స్థానికులు వెంటనే స్పందించి బాధితురాలిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Post a Comment

0 Comments

Close Menu