విశాఖ-కిరండోల్ ప్యాసింజర్ రైలు సర్వీస్ ను తాత్కాలికంగా నిలిపేస్తూ తూర్పు కోస్తా రైల్వే నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి మార్చి 14 వరకూ విశాఖ-కిరండోల్ ప్యాసింజర్ ను, అలాగే మార్చి 15 వరకూ కిరండోల్-విశాఖ ప్యాసింజర్ రైలునూ రద్దు చేస్తున్నట్లు తూర్పు కోస్తా రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. వాల్టేరు డివిజన్ లో జరుగుతున్న ఆధునికీకరణ పనుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. విశాఖ-కిరండోల్ ప్యాసింజర్ ఏపీలోని విశాఖ నగరం నుంచి ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని కిరండోల్ మధ్య ప్రతీ రోజూ రాకపోకలు సాగిస్తుంది. ఈ రైలు మొత్తం 430 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. అయితే ప్యాసింజర్ కావడంతో ఈ ప్రయాణానికి 13 నుంచి 14 గంటలు పడుతుంది. కానీ అరకు మార్గంలో ఈ రైలు అలా నెమ్మదిగా చేసే ప్రయాణం పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచుతుంది. విశాఖపట్నం నుండి ప్రతిరోజూ ఉదయం 7 గంటలకు బయలురే ఈ రైలు కిరండోల్‌కు రాత్రి 8 గంటలకు చేరుతుంది. విశాఖ తర్వాత కొత్తవలస దాటితే అరకు స్టేషన్ వస్తుంది. అరకు వెళ్లే పర్యాటకులు ఇక్కడ దిగిపోతారు.
0 Comments