Ad Code

ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో స్కాం : మాజీ మంత్రి హరీశ్‌ రావు అసెంబ్లీలో ఆరోపణ


తెలంగాణ మాజీ మంత్రి హరీశ్‌ రావు అసెంబ్లీలో మాట్లాడుతూ ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో స్కాం జరిగిందని ఆరోపించారు బియ్యం ఎగుమతుల కోసం నియమించిన అడ్వైజర్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈడీ, సీబీఐ కేసుల్లో నమోదైన వ్యక్తిని అడ్వైజర్‌గా ఎలా నియమించారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ అడ్వైజర్ ఇచ్చిన సలహాల వల్ల రాష్ట్రానికి భారీ నష్టం వాటిల్లిందని ఆరోపించారు. ఫిలిప్పీన్స్‌తో పెద్ద ఎత్తున బియ్యం ఎగుమతుల కోసం ఎంవోయూ చేసుకుని దాన్ని గొప్ప విజయంగా ప్రచారం చేశారని, ఇప్పుడు అదే వ్యవహారం పెద్ద స్కాంగా మారిందని విమర్శించారు. లక్ష మెట్రిక్ టన్నుల బియ్యం ఎగుమతి చేస్తామని ఒప్పందం చేసుకున్నప్పటికీ, కేవలం 27,500 మెట్రిక్ టన్నుల వద్దే ఎందుకు ఆగిపోయిందో ప్రభుత్వం వివరణ ఇవ్వాలని ప్రశ్నించారు. ఇంకా 7,500 మెట్రిక్ టన్నుల బియ్యం కాకినాడ పోర్టులో నిల్వలోనే ఉందని తెలిపారు. ఏడాది కాలంగా పోర్టులో ఉండటం వల్ల గోదాం, హ్యాండ్లింగ్ ఛార్జీలు పెరగలేదా? ఆ బియ్యం నాణ్యత దెబ్బతిన్నదా? పురుగులు పట్టాయా? అని ప్రశ్నించారు. నాఫెడ్ వంటి కేంద్ర సంస్థ డబ్బులు చెల్లిస్తామని ముందుకొచ్చినప్పుడు, ప్రైవేట్ సంస్థకు ఎందుకు ప్రాధాన్యం ఇచ్చారో స్పష్టత ఇవ్వాలని హరీశ్‌రావు నిలదీశారు. ఈ మొత్తం వ్యవహారంపై హౌస్ కమిటీ ఏర్పాటు చేసి దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. తాను చెప్పిన ఆరోపణలను నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. అదే సమయంలో యాసంగి ధాన్యానికి బోనస్ చెల్లింపులపై కూడా ప్రశ్నలు లేవనెత్తారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేదని విమర్శించారు. ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో స్కాం జరిగిందని ఆరోపించారు మాజీ మంత్రి హరీశ్‌ రావు. అసెంబ్లీలో మాట్లాడిన హరీశ్‌…బియ్యం ఎగుమతుల కోసం నియమించిన అడ్వైజర్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈడీ, సీబీఐ కేసుల్లో నమోదైన వ్యక్తిని అడ్వైజర్‌గా ఎలా నియమించారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ అడ్వైజర్ ఇచ్చిన సలహాల వల్ల రాష్ట్రానికి భారీ నష్టం వాటిల్లిందని ఆరోపించారు.

Post a Comment

0 Comments

Close Menu