తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో సంచలనం సృష్టించిన యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో తాజా పరిణామాలు దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయి. ఈ కేసులో సంచలన ఆడియో కాల్ లీక్ అయింది. ఈ ఆడియో కాల్‌లో వైష్ణవి హత్యకు ముందు ఆమె అత్తతో మాట్లాడింది. వైష్ణవిని హరిబాబు తల్లి లక్ష్మి అభ్యంతరకరంగా ధూషించినట్లు ఈ ఆడియో కాల్‌లో ఉంది. బెడ్ రూమ్‌లో ఉంగరం దొంగిలించారని అభ్యంతరకంగా హరిబాబు తల్లి మాట్లాడింది. తల్లితో ఫోన్ మాట్లాడినప్పుడు వైష్ణవితోనే హరిబాబు ఉన్నారు. ఉంగరం పేరుతో నాటకాలు ఆడవద్దని తన తల్లిని హరిబాబు హెచ్చరించారు. ఈ కేసులో పోలీసులు వేగంగా స్పందించి నిందితుడిని పట్టుకున్నారు. నిందితుడు హరిబాబు, వైష్ణవిని అదనపు కట్నం కోసమే హత్య చేసినట్లు పోలీసుల విచారణలో అంగీకరించాడు. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు, కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. ఈ హత్య కేవలం హరిబాబు ఒక్కడే చేశాడా? కుటుంబ సభ్యుల ప్రోద్బలం ఏమైనా ఉందా? అనే కోణంలో పోలీసులు సమగ్రంగా విచారిస్తున్నారు. ఘటనా స్థలంలో లభించిన క్లూస్, ఫోరెన్సిక్ ఆధారాలు ఈ కేసులో నిందితుడికి శిక్ష పడటంలో కీలక పాత్ర పోషించనున్నాయి.
0 Comments